ఆంధ్రప్రదేశ్‌

సర్కారుపై సమరం సాగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 31: తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. తెలంగాణ టిడిపి నేతలకు సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, క్షేత్రస్థాయి నుంచి పార్టీని పునర్మిర్మించేందుకు కొత్త కమిటీలకు సమష్టిగా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. తెలంగాణలో పార్టీ నిర్వహిస్తోన్న నిరసన కార్యక్రమాల పట్ల బాబు సంతృప్తి వ్యక్తం చేసి ఇంకా వేగం పెంచాలని ఆదేశించారు. గురువారం విజయవాడలో జరిగిన తెలుగుదేశం తెలంగాణ ముఖ్య నాయకుల సమావేశంలో బాబు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలను ఈ సందర్భంగా బాబుకు అక్కడి నేతలు వివరించారు. త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. నంద్యాల ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచినందుకు బాబును నేతలు అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ జిల్లా పార్టీ కన్వీనర్లను ఖరారు చేశారు. బాబు ఆమోదించిన జిల్లా కన్వీనర్లలో రెడ్డి వర్గానికి పెద్ద పీట వేశారు. 8 మంది రెడ్లు, ఐదుగురు వెలమలు, ఆరుగులు బీసీలు, ఇద్దరు మాల, ఇద్దరు మాదిగ, ఇద్దరు ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు గరికపాటి మోహనరావు, రేవూరి వెంకట వీరయ్య, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ జి.బుచ్చిలింగం పాల్గొన్నారు.