ఆంధ్రప్రదేశ్‌

నూతనంగా 2500 రైతుసేవా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 31: రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయ శాఖను బలోపేతం చేయడంతో పాటు రైతులకు మరింత దగ్గర చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్టవ్య్రాప్తంగా 2500 క్లస్టర్లలో ఏఇఓ కార్యాలయాలు, ప్రత్యేక గోదాములు, రైతులకు సమావేశ మందిరాలను నిర్మించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో క్లస్టర్ల వారీగా స్థల సేకరణ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయ శాఖలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 2500 క్లస్టర్లలో ఏఇఓ కార్యాలయం, గోదాము, సమావేశ మందిరం ఒకే ప్రాంతంలో ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఆ కేంద్రాల్లో కచ్చితంగా ఎఇఓ అందుబాటులో ఉండేలా, నిరంతరం రైతులతో సమావేశాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. సుమారు అరెకరం స్థలంలో నిర్మించనున్న ఈ కేంద్రం రైతుసేవా కేంద్రంగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా భవనంలో నిర్మించే గోదాములోనే భూసార పరీక్షలు, వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, రైతుల భూముల వివరాలు, విత్తనాలు నిల్వ చేయనున్నారు. రైతులతో సేంద్రియ ఎరువుల వినియోగంపై నిరంతరం సమావేశాలు జరిగేలా మైక్ లాంటివి కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా ఆయా క్లస్టర్లలో అనేక చోట్ల స్థల సేకరణ సమస్యగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేక అంగన్‌వాడీ భవనాలు కూడా నిర్మించలేని పరిస్థితి ఉన్నది. ఒక్కో మండలానికి 5నుంచి 6వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేస్తుండటంతో ప్రతిచోట అరెకరం స్థలం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ అధికారులు సమగ్ర భూసర్వే చేపట్టనున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ భూమి భయటపడుతుందని, దానిని ప్రభుత్వ భవనాలకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కల్లా భవనాల నిర్మాణంపూర్తికావాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.