ఆంధ్రప్రదేశ్‌

9 మందికి కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులకు 58 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అవార్డులకు గోరంట్ల శ్రీనివాసరావు (బికె పాలెం, గుంటూరు), సిహెచ్.శ్రీనివాసరావు (జేగురుపాడు- తూర్పు గోదావరి), ఎన్.విమల కుమారి (పాములపాడు - గుంటూరు), ఎర్రా ఎస్‌ఎస్‌జిఎస్ చక్రవర్తి (మారేడుపూడి - విశాఖ), గోట్టేటి రవి ( ఎండాడ - విశాఖ), చాగంటి శ్రీనివాసరావు (మానుకొండవారిపాలెం - గుంటూరు), సెకండరీ పాఠశాలలకు సంబంధించి బి.శంకరరావు (జిసి పెంట- విజయనగరం), డి.్ధర్మరాజు (చాగల్లు- పశ్చిమ గోదావరి), రెడ్డి లోకనాథ రెడ్డి (త్యాజంపూడి - పశ్చిమ గోదావరి) ఎంపికయ్యారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్‌లో ఈ నెల 5న జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. సర్వీస్ కేటగిరీలో 30 మందిని, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్‌కు సంబంధించి 28 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. విజయవాడలో ఈనెల 5న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందచేస్తారు.