ఆంధ్రప్రదేశ్‌

త్వరలో వైకాపా గల్లంతు: కెఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో ప్రతిపక్ష వైకాపా త్వరలోనే గల్లంతవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఫలితాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం పట్ల శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటుతో ఆమోద ముద్ర వేశారని తెలిపారు. ఈ రెండు ఎన్నికల తరువాత వైకాపా నేతలు ఆ పార్టీలో కొనసాగాలా? వద్దా? అన్న విషయమై తర్జన భర్జనలు పడుతున్నారన్నారు. త్వరలోనే ఆ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రతిపక్ష నేతను నమ్మే పరిస్థితి లేదన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.