ఆంధ్రప్రదేశ్‌

సాగర్‌కి నిలిచిపోయిన నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, మే 19: శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి విడుదల అవుతున్న నీటి సరఫరాను గురువారం పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 507.60 అడుగులకు చేరుకుంది. ఇది 127.6322 టియంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి హైదరాబాద్‌లోని జంటనగరాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 400క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం సాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 5467 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.