ఆంధ్రప్రదేశ్‌

సుస్థిర అభివృద్ధికి ప్రజల పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 1: నంద్యాల, కాకినాడ ఎన్నికల గెలుపు ద్వారా రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మా పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలు అచంచల విశ్వాసంతో గెలిపించారన్నారు. మూడు సంవత్సరాల్లో అనేకమంది రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుని అరాచకం సృష్టించాలని చూశారన్నారు. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచక శక్తులను ఎన్నడూ చూడలేదని, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని, అయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వారికి కనువిప్పు కలిగేలా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిపించారన్నారు. అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కాకినాడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, కాకినాడను అభివృద్ధి చేయడానికి స్మార్ట్ సిటీగా చేశామని, కొన్ని పనులు అక్కడ అనుకున్న విధంగా జరగలేదని, తనకూ సంతృప్తి లేదన్నారు. అయినా కాకినాడను ఒక మోడల్ సిటీగా తయారుచేయడానికి కృషి చేస్తామన్నారు. నంద్యాల పట్టణాన్ని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ మూడు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మా ప్రభుత్వంపై విశ్వాసంతో, నమ్మకంతో తీర్పు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రిగా రాత్రింబవళ్లు పనిచేస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రజలకు మేలు జరిగేలాగా చేయడానికి ఒక విజన్‌తో సుస్థిరమైన అభివృద్ధికి దోహదపడేలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల నేడు కృష్ణాడెల్టాలో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడగలిగామన్నారు. అదే పట్టిసీమ ప్రాజెక్టుపై వీళ్ల బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గినట్లయితే నేడు కృష్ణాడెల్టా పరిస్థితి భయానకంగా ఉండేదన్నారు. పట్టిసీమ పూర్తయితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటించినవారు నేడు ఏమయ్యారో కనపడటం లేదన్నారు. 100 నుంచి 150 టిఎంసిలు పట్టిసీమ ద్వారా తీసుకురావడం వల్ల రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామన్నారు. ప్రజల సమస్యలపై పరిష్కార వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. స్పోర్ట్స్‌లో ప్రతిభ కనపరిచిన వారికి చేయూత అందించడం వల్ల నేడు వారు బాగా రాణించగలుగుతున్నారన్నారు. ప్రజలు తనను నమ్మి తన మీద విశ్వాసంతో ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారన్నారు. ఎన్నికలు అనేవి ఐదేళ్లకోసారి జరగాలని, ఆ తర్వాత అభివృద్ధివైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘రాష్ట్రంలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటాం. అవినీతిని అరికట్టడానికి ఆన్‌లైన్ లావాదేవీలు బాగా ఉపయోగపడతాయి. ఆన్‌లైన్ లావాదేవీలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చని’ తెలిపారు. రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు కావాలనుకునే వారికి 15 నిముషాల్లో అందిస్తున్నామని, 90 నుంచి 95 శాతం లాండ్ సెక్యూరిటీ ఫీచర్స్ అందించడంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. నంద్యాల, కాకినాడ ఫలితాలపై 4,5 తేదీల్లో సమీక్ష చేసి పరిశీలిస్తామన్నారు. ఎన్నికల్లో గెలిస్తే సుస్థిరత వస్తుందని, సుస్థిరత ఉంటే అభివృద్ధి ఏర్పడుతుందని, ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారన్నారు. ఈ ఫలితాల వల్ల ప్రభుత్వానికి విశ్వాసం పెరుగుతుందని, దాంతో పరిపాలనా సౌలభ్యానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కాకినాడ కార్పొరేషన్‌లో నిలబడిన 45 మంది అభ్యర్థులు రకరకాల వ్యక్తులని, వివిధ వర్గాలకు చెందినవారని, వారిని కంట్రోల్ చేసే శక్తి నాయకుడికి ఉందని ప్రజలు గెలిపించారన్నారు. కాకినాడలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అనే తారతమ్యాన్ని మర్చిపోయి సామాన్య కార్యకర్తగా పనిచేయడం వల్ల గెలుపు సాధ్యమైందన్నారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఇంటింటికి వెళ్లి పనిచేయడం వల్ల సామాన్యులు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్నారన్నారు. తాను చెప్పిన దానికి తు.చ తప్పకుండా ఆచరించే విధంగా ఈ రెండు చోట్ల అభివృద్ధి జరుగుతుందని, ఇలాంటి కొన్ని నగరాల మోడల్స్ అభివృద్ధికి చిహ్నంగా తయారుచేస్తామన్నారు.
అమెరికాలో
తుపాను బాధితులను ఆదుకుంటాం
అమెరికాలోని టెక్సాస్‌లో సంభవించిన హరికేన్ తుఫాన్ వల్ల అక్కడ తెలుగువారు ఇబ్బందులు పడ్డారని వారికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడానికి ఎన్‌ఆర్‌ఐల శాఖ తరపున జయరాం, రవిలను అక్కడికి పంపి, వారికి ఏ సహాయం కావాలో అది అందిస్తామని, అన్ని విధాల అక్కడ తెలుగువారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.