ఆంధ్రప్రదేశ్‌

నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్‌పై మంత్రి సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్ వ్యవహారంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి, సీరియస్ అయ్యారు. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ రామచంద్రరాజు, నూజివీడు ఐఐఐటి డైరెక్టర్‌తో మాట్లాడారు. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ర్యాగింగ్‌పై దృష్టి సారించాలని అకడమిక్ సంవత్సరం ప్రారంభం నుంచే చెప్తున్నా నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, అనంతరం తీసుకున్న చర్యలపైనా.. ర్యాగింగ్ ఘటనలపైనా నివేదిక పంపాలని ఆదేశించారు. ఇక మీదట ర్యాగింగ్ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విద్యాలయాల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.