ఆంధ్రప్రదేశ్‌

వంట గ్యాస్ ధర పెరిగింది.. సబ్సిడీ తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: వంట గ్యాస్ సబ్సిడీ పూర్తిస్థాయిలో తొలగింపునకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. 2018 మార్చి మాసాంతానికికల్లా సబ్సిడీ పూర్తిగా మాయం కానుంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వంట గ్యాస్‌కు సంబంధించి పలు సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సాలీనా 12 సిలిండర్లు దాటితే సబ్సిడీ లేదు. రూ.10 లక్షలు ఆదాయం దాటిన వారికి కూడా సబ్సిడీ లేదు. సబ్సిడీ అవసరం లేదనుకునేవారు తమకు తాముగా ప్రకటించుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రం మొత్తంపై 2లక్షల 39వేల 402 గ్యాస్ కనెక్షన్లు సబ్సిడీ వదులుకున్నాయి. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా ఒక కోటీ 28 లక్షల 76వేల 307 గృహావసరాలకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న 59లక్షల 15వేల 950 గ్యాస్ కనెక్షన్లను దీపం పథకం కింద ఇచ్చారు. ఆగస్టు మాసంలో 14.2కిలోల సిలిండర్ ధర రూ.549.50 పైసలు ఉండగా, బ్యాంక్ ఖాతాలో ఆ తర్వాత రూ.59లు సబ్సిడీ జమ అయ్యేది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఒక్కసారిగా సిలిండర్ ధర రూ.617లకు చేరింది. అంటే రూ.67 పెరిగింది. ఇదే సమయంలో సబ్సిడీలో రూ.7 కోత విధించారు. ఈ విధంగా ఒక సిలెండర్‌పై వినియోగదారునిపై రూ.74 అదనపు భారం పడినట్టయింది. సగటున ప్రతి కనెక్షన్‌దారుడు సగటున నెలకు ఒక సిలిండర్‌ను వినియోగిస్తారనుకుంటే ఈమేర రూ.320 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇలా సాలీనా 3వేల 850 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇక కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ ధర ఆగస్టు మాసంలో రూ.1044లు ఉండగా సెప్టెంబర్ ఒకటో తేదీ నంచి రూ.1160లకు పెరిగింది. అంటే ఒక్కసారి రూ.116లు పెరిగినట్లయింది.
రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కన కనెక్షన్లు లక్షా రెండువేలు ఉన్నాయి. సగటున ఒక్క కనెక్షన్‌దారుడు నెలకు 10 సిలిండర్‌లు వినియోగిస్తాడు. ప్రస్తుతం పెరిగిన రేటు ప్రకారం కమర్షియల్ గ్యాస్ కనెక్షన్‌దారులపై నెలకు రూ.15 కోట్లు చొప్పున సాలీనా రూ.150 కోట్లు అదనపు భారం పడుతుంది. తాజాగా పెరిగిన రేట్లు, తగ్గిన సబ్సిడీతో రాష్ట్రంలోని గ్యాస్ కనెక్షన్‌దారులందరిపై సాలీనా నాలుగువేల కోట్ల రూపాయలు అదనపు భారం పడబోతున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వివిధ గ్యాస్ కంపెనీలకు గృహ కనెక్షన్‌లపై సబ్సిడీ రూపంలో సాలీనా మూడువేల కోట్ల 30 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నది. ఇటీవల కాలంలో గ్యాస్‌పై జిఎస్‌టి ప్రభావం కూడా కొంతమేర పడింది. గృహావసరాల సిలెండర్లపై జిఎస్టీ 5శాతం యథాతథంగా ఉండగా వాణిజ్యావసరాల సిలెండర్లపై 14 శాతం నుంచి 18 శాతం పెరిగింది. ప్రస్తుతం డీలర్లకు ఒక్కో సిలెండర్‌పై 20 రూపాయలు కమిషన్ లభిస్తోంది. వచ్చే మార్చి అనంతరం డీలర్లు పరిమితుల్లేకుండా ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం రాబోతోంది. దీనివలన వీటి మధ్య పోటీ పెరుగుతుంది.