ఆంధ్రప్రదేశ్‌

పరీక్షలో మంత్రులు పాస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 2: ఇటీవల జరిగిన రెండు కీలక ఎన్నికల్లో టిడిపి భారీ విజయం సాధించడంలో మంత్రులు కీలకపాత్ర పోషించారు. నంద్యాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శిద్దా రాఘవరావు కాకినాడలో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చక్రం తిప్పి పార్టీ అభ్యర్ధులను విజయతీరాలకు చేర్చారని పార్టీ తాజా విశే్లషణలో తేలింది. మరో 15 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో గెలిచితీరాల్సిన అవసరం ఉన్న టిడిపి, అందుకోసం మంత్రులను రంగంలోకి దింపింది. ఆ మేరకు నంద్యాలలో సోమిరెడ్డి, కాకినాడలో యనమల అంతా తానై మంత్రాంగం నెరిపారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఈ స్థాయిలో మంత్రులను మోహరించిన సందర్భాలు లేవు. గతానికి భిన్నంగా ఎన్నికల ప్రచార వ్యూహంలో బాబు, మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఫలితాలు మరింత మెరుగుగా వచ్చాయి. కాకినాడలో యనమల, చినరాజప్ప ఇద్దరూ ఎన్నికలను తమ భుజానేసుకున్నారు. యనమల దర్శకత్వంలో చినరాజప్ప అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, విజయంలో కీలకపాత్ర పోషించారు. జిల్లా కాపులలో ఇమేజ్ ఉండి, అందరికీ అందుబాటులో ఉంటారన్న చినరాజప్పను బాబు తురుపుముక్కలా ప్రయోగించారు. అందుకే వైసీపీ 21 మంది కాపులకు టికెట్లు ఇచ్చినా కేవలం 5 గురు మాత్రమే గెలిచారు. టిడిపి 13 మంది కాపులను గెలిపించుకోవడం వెనుక రాజప్ప ముఖ్యపాత్ర పోషించారు. ప్రధానంగా జిల్లాలో కాపులపై ముద్రగడ ప్రభావం తొలగించడంలో రాజప్ప విజయం సాధించి, తానే అసలు కాపునేతనన్న సంకేతాలిచ్చారు. యనమల నంద్యాలలో సోమిరెడ్డి మాదిరిగా వ్యూహరచనకు నాయకత్వం వహించారు. కాకినాడ కంటే కొద్దిరోజుల ముందు జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా బాబు పెట్టిన పరీక్షలో మంత్రులు పాసయ్యారు. మంత్రి సోమిరెడ్డికి ఈ విజయంతో ఇంటా బయటా ఇమేజ్ వచ్చింది.
కాగా రాష్ట్రంలో వైశ్య వర్గానికి మంత్రి శిద్దారాఘవరావు రూపంలో కొత్త నాయకుడు లభించారు. ఆయన నంద్యాలలో పాటు, కాకినాడ ఎన్నికల్లో కూడా వైశ్యవర్గాన్ని సమీకరించి వారిని పార్టీ వైపు నడిపించారు. కాకినాడలో కమ్మ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వని నేపథ్యంలో, ఆ సామాజికవర్గం ప్రచారానికి దూరంగా ఉండిపోయింది. అనేక వార్డుల్లో ప్రభావం చూపే శక్తి ఉన్న కమ్మ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు, అదే వర్గానికి చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నాయకత్వం రంగంలోకి దింపింది. దానితో ఆయన వారిని బుజ్జగించి, ఒకరికి కో ఆప్షన్ పదవి ఇస్తామని చెప్పి వారితో పనిచేయించారు. ఈవిధంగా మంత్రులకు చంద్రబాబు పెట్టిన పరీక్షలో వారంతా పాసవడం వారి సమర్థత నిరూపించుకున్నట్టయింది.