ఆంధ్రప్రదేశ్‌

ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 2: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద శనివారం ఆయన కుటుంబసభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఘనంగా నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఉదయమే ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ, సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, జగన్ సతీమణి భారతి, వైఎస్ కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపిలు వైవి.సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్‌బి.అంజద్‌బాషా, పి.రవీంద్రనాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు సతీమణి సునీత పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్‌కు నివాళులర్పించారు.

చిత్రం..ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పిస్తున్న జగన్, ఇతర కుటుంబ సభ్యులు