ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 2: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి ఆలోచనలు భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను ఇరిగేషన్ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరిని, సోమశిల, కండలేరును కలుపుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, అవిరాగానే ప్రకాశం బ్యారేజ్ ఎగువన అమరావతి బ్యారేజీ నిర్మాణం చేపట్టి అక్కడ నిలబెట్టిన 13 టి ఎంసిలను కృష్ణతోపాటు గోదావరి నుంచి వచ్చే నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జున సాగర్ కందుకూరు మీదుగా సోమశిల-కండలేరుకు నీటిని తెచ్చుకోగలిగితే ఇటు గాలేరు=నగరి, హంద్రీ-నీవా అనుసంధానం చేసుకుని ఎప్పుడు ఏ నీరు వచ్చినా రీ ఇంజినీరింగ్ చేసుకుని నీటిని కాపాడుకోవచ్చని అన్నారు. 2,056 కిలీమీటర్లు టనె్నల్ నిర్మాణం పనులకు వేలకోట్లు జి ఎన్ ఎస్ ఎస్ నిధులు ద్వారా ఎక్కడ ఏనీరు ఉన్నా ఆ నీటిని రాయలసీమలోని నాలుగు జిల్లాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎలా ఆదుకోవాలో అని ముఖ్యమంత్రి దృష్టిపెట్టారన్నారు. వంశధార-నాగావళి అనుసంధానానికి చర్యలు చేపట్టామన్నారు.