ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలెక్కడ జరిగినా టిడిపిదే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఇక మీదట ఎక్కడ ఎన్నికలు జరిగినా నంద్యాల, కాకినాడలో ఫలితాలే పునరావృతమవుతాయని పలువురు మంత్రులు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన విశాఖ రూరల్ జిల్లా టిడిపి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప, ఆర్ అండ్‌బి మంత్రి అయ్యన్న పాత్రుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. నంద్యాల అసెంబ్లీ, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు టిడిపి భవిష్యత్‌కు గీటురాయి వంటివని చినరాజప్ప పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో అన్ని వర్గాలు టిడిపి వెంటే ఉన్నట్టు స్పష్టం చేశాయన్నారు. విపక్ష నేత జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసి భంగపడ్డారన్నారు. ఎన్నికలకు ముందు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో పాదయాత్ర డ్రామా ఆడించారన్నారు. ఎన్నికల్లో టిడిపి గెలవడంతో వీరంతా తోకముడిచారన్నారు. కాపులంతా టిడిపి వైపే ఉన్నారనడానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయమే నిదర్శనమన్నారు.
ఇక జబర్దస్త్‌కే రోజా పరిమితం
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కంటున్నారని, ఇదే ఎన్నికల ఫలితాలు 2019లో కూడా పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. ఇక వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా వైకాపాలో ఉన్నంత కాలం ఆపార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ఐరన్ లెగ్ రోజాతోనే వైకాపా భూ స్థాపితం అవుతుందన్నారు. జబర్దస్త్ టివీ షో చేసుకుంటూ కాలం గడపాల్సిందేనని రోజాకు సూచించారు. జగన్ కూడా పార్టీని మూసేసి డ్రామా కంపెనీ పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. నంద్యాల అసెంబ్లీ, కాకినాడ కార్పొరేషన్ ఉపఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)కి కూడా త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తే టిడిపి సత్తా చాటుతామన్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపి పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.