ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్ఠించినచోటనే నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో వెలసిన 72 అడుగుల భారీ వినాయకునికి ఆదివారం రాత్రి ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే వైభవంగా నిమజ్జనం జరిగింది. ఇందుకోసం రెండు ఫైరింజన్లను వినియోగించారు. చూడముచ్చటైన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. సరిగ్గా రాత్రి 7గంటలకు నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాగా విగ్రహం పూర్తిగా కరిగిపోయేసరికి అర్ధరాత్రి దాటింది. నిమజ్జనం సమయంలో జైగణేష్ మహరాజ్‌కీ జై.. అనే నినాదాలు మార్మోగాయి. ఉదయం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో డూండీ గణేష్ సేవా సమితి గౌరవాధ్యక్షుడు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సేవా సమితి వ్యవస్థాపకులు సారేపల్లి రాకేష్, అధ్యక్షుడు గడ్డం రవి, కార్యదర్శి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో గత 10 రోజులుగా వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ భారీ విగ్రహాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ విగ్రహం తయారీ కోసం ఒడిశా, బెంగాల్‌కు చెందిన 100 మంది కార్మికులు దాదాపు నెలరోజులు శ్రమించారు. ఇక విగ్రహం తయారీకి 20 టన్నుల ఇనుము, ఐదు టన్నుల పీచు, ఐదు టన్నుల మట్టి, 5 టన్నుల ముంబాయి మట్టిని వినియోగించాల్సి వచ్చింది.

చిత్రం..ఫైరింజన్‌తో నీళ్లు కొట్టి గణేష్ విగ్రహాన్ని కరిగిస్తున్న దృశ్యం