ఆంధ్రప్రదేశ్‌

కొత్త కేంద్ర మంత్రులకు చంద్రబాబు శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: కేంద్ర మంత్రివర్గంలో చేరిన కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అశాస్ర్తియ విభజన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ రాష్ట్రానికి కొత్త బృందం తోడ్పాటు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తిచేసిన రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్లను కూడా ముఖ్యమంత్రి అభినందించారు.
బాలిక హత్యపై సీరియస్
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రెడ్డియవలసలో ఇటీవల ఒక బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తపర్చారు. ఈ ఘటనపై ఆయస శనివారం అధికారులతో సమీక్షించారు. దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.