ఆంధ్రప్రదేశ్‌

విజయపథాన ఆర్టీసీ సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: ఉమ్మడి రాష్ట్రంలో, విభజన అనంతరం ఏపిఎస్ ఆర్టీసీ దాదాపు 4వేల కోట్ల రూపాయల నష్టాలతో మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో సంస్థ ఎండి, వైస్ చైర్మన్ ఎం మాలకొండయ్య సిబ్బందిని, ప్రయాణికులను నొప్పించకుండా తనదైన శైలిలో సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చులు తగ్గాయి. ఇంధనం పొదుపయింది. ఆపై ఆదాయం పెరిగింది. అధికారిక గణాంకాల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ బస్సులన్నీ దాదాపు 44కోట్ల కి.మీ.లు తిరిగి ఆర్జించిన ఆదాయం 1,332 కోట్ల రూపాయలు. ఇక ఖర్చులు ఆదాయానికి మించి అంటే రూ.1540 కోట్లకు చేరాయి. సంస్థకు నాడు రూ.210 కోట్ల నష్టం వచ్చింది. ఇక ప్రస్తుత త్రైమాసికంలో గతం కంటే 3కోట్ల 18 లక్షల కి.మీల తక్కువ దూరం బస్సులు నడిచాయి.
ఖర్చులు దాదాపు రూ.40కోట్లు తగ్గితే, ఆదాయం రూ.110 కోట్లు పెరిగింది. ఈ త్రైమాసికంలో అధిక లాభాలు ఆర్జించిన డిపోల్లో రూ. 6కోట్ల 60లక్షలతో విజయవాడ (కృష్ణా), రూ. 2కోట్ల 84లక్షలతో అమలాపురం (తూ.గో), రూ. 2కోట్ల 61లక్షలతో కాకినాడ (తూ.గో) ముందంజలో ఉన్నాయి. ఇక అత్యధిక నష్టాల్లో దాదాపు రూ. 2కోట్లతో రాయచోటి డిపో (కడప), తర్వాత రూ. కోటీ 95 లక్షలతో అనంతపురం డిపో, రూ. కోటీ 89 లక్షలతో మదనపల్లి డిపో (చిత్తూరు) వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.
ఆర్టీసీలో ఎన్ని సంస్కరణలు చోటుచేసుకున్నప్పటికీ 2015-16తో పాటు, 2016-17లో రూ.813 కోట్ల నికర నష్టం (14 శాతం) పెరిగింది. ఈ సమయంలో సంస్థ నిర్వహణ నష్టం ప్రతి కిలోమీటరుకు రెండు రూపాయలుగా నమోదైంది. అసలు వచ్చే ఆదాయంలో ప్రతి వంద రూపాయలకు అయ్యే ఖర్చులు ఎలా ఉన్నాయంటే జీతభత్యాల కింద రూ.45లు, వాహన ఇంధనం రూ.23లు, అద్దె బస్సుల ఖర్చు రూ.12లు, వాహన పన్నులు రూ.5లు, తరుగుదల రూ.3లు. అన్నింటికీ మించి వడ్డీ కింద 4 రూపాయలు, వాహన మరమ్మతుల (టైర్లు, స్టోర్స్) కింద రూ.3లు, ప్రమాద నష్టపరిహారం, మెడికల్ రీయింబర్స్‌మెంట్, టోల్‌గేట్లకు ఐదు రూపాయలు ఖర్చవుతోంది.
డిఏ చెల్లింపునకు రూ.35 కోట్లు
ఆర్టీసీ ఎన్ని నష్టాల్లో ఉన్నప్పటికీ సంస్థలో పనిచేసే దాదాపు 60వేల మంది ఉద్యోగులు, కార్మికులందరికీ 2016 జూలై నుంచి డిసెంబర్ మాసం వరకు చెల్లించాల్సిన కరవు భత్యం బకాయిలను ఆగస్టు నెల వేతనంతో చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం రూ.35 కోట్లు కేటాయించింది.