ఆంధ్రప్రదేశ్‌

నాణేల సర్వేపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 3: మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 129వ జయంతిని పురస్కరించుకుని అమలాపురానికి చెందిన విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయుడు గురునాథ రాజు, నాణాల సేకరణకర్త పుత్సా కృష్ణకామేశ్వర్లు సంయుక్తంగా నాణేలతో రూపొందించిన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం స్థానిక వాకర్స్ క్లబ్‌లో ఆ చిత్రాన్ని వారు ప్రదర్శించారు. ఒక పైసా రాగి నాణెం, 10 పైసలు, 25 పైసలు, ఒక రూపాయి, ఐదు రూపాయల నాణేలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మొత్తం 395 నాణేలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అలాగే కోల్‌కతా టంకశాల సర్వేపల్లి రాధాకృష్ణన్‌పై ప్రత్యేకంగా విడుదల చేసిన రూ.125, రూ.10 స్మారక నాణేలను కూడా వారు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆకెళ్ల విఠల్, చెక్కా సత్యనారాయణమూర్తి, కొప్పిశెట్టి దురంధరరావు, కోటిలింగం, నల్లా నరసింహమూర్తి పాల్గొని చిత్ర రూపకర్తలు గురునాథరాజు, కృష్ణకామేశ్వర్లును అభినందించారు.