ఆంధ్రప్రదేశ్‌

కార్మిక వ్యతిరేక విధానాలపై నవంబర్‌లో ఢిల్లీలో మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నవంబర్ 9, 10, 11 తేదీల్లో కొత్త ఢిల్లీలో లక్షలాది మంది కార్మికులతో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి తెలిపారు. ఐఎన్‌టియుసి అనుబంధ సంస్థ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లారుూస్ సంఘ్ కార్యాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల అన్ని ట్రేడ్ యూనియన్ల రాష్టస్థ్రాయి నాయకుల సమావేశం ఆదివారం నగరంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య, ఫాసిస్టు విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్మికశక్తితో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, యూనియన్ల నాయకులు, కార్మికులతో కలిసి ఈ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని సంజీవరెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి కంకణం కట్టుకోవడం, రక్షణ రంగ సంస్థను సైతం ప్రైవేటీకరించాలని నిర్ణయాలు తీసుకోవడం అనైతికమన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ, ఎఫ్‌డిఐలు తీసుకురావడం రైల్వేల భద్రతపై ప్రభావం చూపిందని సంజీవరెడ్డి వివరించారు. ఐఎన్‌టియుసి కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు నుండి గఫూర్, ఏఐటియుసి నుండి ఓబులేసు, టియుసిసి నుండి సుందరరావు, ఐఎఫ్‌టియు నుండి కె రామారావు, ఎంప్లారుూస్ సంఘ్ డివిజనల్ కార్యదర్శి ఆమంచి వెంకటేశ్వరరావు, వర్క్‌షాపు డివిజన్ కార్యదర్శి చాంద్‌బాషా, జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చిత్రం..వివిధ కార్మిక సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న
ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి