ఆంధ్రప్రదేశ్‌

గండం తప్పింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 20: బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తుపాను క్రమంగా బలహీన పడుతోంది. దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో పారాదీప్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం రోను తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా కదులుతూ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. అన్ని పోర్టుల్లోను రెండవ నెంబర్ ప్రమాద సూచికలను జారీ చేశారు. ఉత్తర కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని, దక్షిణ కోస్తా లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా రోను తుపాను ప్రభావంతో రాష్టవ్య్రాప్తంగా భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. శుక్రవారం ఇచ్ఛాపురంలో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కళింగపట్నం 14.4 సెంమీ రణస్థలం 13.8 సెంమీ, అమలాపురం 11.5 సెంమీ, పలాస 11.4 సెంమీ, అవనిగడ్డ 10.6 సెంమీ, టెక్కలి 10.9 సెంమీ, మందస 9.8 సెంమీ, సోంపేట 8.6 సెంమీ, రేపల్లె 7.9 సెంమీ విశాఖపట్నం 7.8 సెంమీ వర్షపాతం నమోదైంది.

చిత్రం... విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చాపరాయి గెడ్డ,
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో రోను ప్రభావంతో వీస్తున్న ఈదురు గాలులు