ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమాలపై వాట్సప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 4: ఇసుక అక్రమ తవ్వకాలకు, అమ్మకాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేయాలని తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇసుక అక్రమాలను వాట్సాప్ గ్రూపులో ఉంచడం ద్వారా అక్రమాలకు పాల్పడేవారికి చెక్ పెట్టవచ్చని, దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయి అధికారుల వరకు మానిటరింగ్ చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అలాగే ఇసుక రవాణాచేసే ప్రతీ వాహనాన్ని జిపిఎస్ ద్వారా పర్యవేక్షించనున్నారు. గతంలో జిపిఎస్ సౌకర్యం కల్పించినప్పటికీ పర్యవేక్షణా లోపంతో ఈ ప్రక్రియకు గ్రహణం పట్టింది. ఇకపై జిపిఎస్ విధానంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా ఇసుకను విక్రయించిన పక్షంలో రూ.25వేల వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుతం 29 ఇసుక రీచ్‌లు నిర్వహణలో ఉన్నాయి. ఈ రీచ్‌లన్నిటికీ ర్యాంపు స్థాయి అధికారులను నియమించారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్, రవాణా వంటి ప్రక్రియలను ర్యాంపు స్థాయి అధికారులు పర్యవేక్షించాల్సివుంది. గోదావరి వరదల కారణంగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని బ్రిడ్జి లంక, కేతవారి లంకల్లో పూడిక తీతల్లో భాగంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయా రీచ్‌ల నుండి జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. ఇసుక లోడింగ్, అన్‌లోడింగ్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేసినా, ఇసుకను విక్రయించినా రూ.25వేల వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. రెవెన్యూ, రవాణా, పోలీస్ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దాడులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ర్యాంపుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇసుక రవాణా కోసం చెల్లించాల్సిన ధరల వివరాలను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంతో పాటు ఇకపై ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రభుత్వ యంత్రాంగం నిశితంగా ర్యాంపుల వద్ద పరిస్థితులను సమీక్షించేలా చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. గోదావరి వరద తగ్గిన తర్వాత పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను సైతం పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద జిపిఎస్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారులు గతంలో పంపిణీచేసిన జిపిఎస్ పరికరాల పనితీరును పరిశీలించడంతో పాటు అదనంగా మరిన్ని మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఏజన్సీలోని ఎటపాకలో తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 లారీలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు.