ఆంధ్రప్రదేశ్‌

జూలై 31 నుంచి అంత్య పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 21: ప్రపంచంలోనే ఏ నదికీ లేనివిధంగా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు గోదావరి నదికి అంత్య పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కౌన్సిల్ సమావేశం ఈమేరకు తీర్మానించింది. రానున్న జూలై 31 నుంచి మొదలై ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరి నదికి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. అదేరోజు నుంచి కృష్ణా పుష్కరాలు ఆరంభమవుతాయి. పుష్కరుడు గోదావరి నది నుంచి వీడ్కోలు తీసుకుని కృష్ణా నదిలోకి ప్రవేశించడంతో అక్కడ పుష్కరాలు మొదలవుతాయి. అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కౌన్సిల్ చర్చించింది. పూర్తిగా తమ భుజస్కందాలపైనే వేసుకుని వేడుకను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. పండుగ మాదిరిగా చేయాలని సంకల్పించారు. అతిథులందరినీ స్వయంగా పాలకవర్గమే ఆహ్వానించి, పుష్కరుడికి వీడ్కోలు పలకాలని నిర్ణయించారు.