ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో ఆర్థిక నగరాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో ఆర్థిక నగరాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. ఈ నగరాల నిర్మాణం 18 నుంచి 24 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పట్టణ వౌలిక సదుపాయాల ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, వెదురువాడ ప్రాంతాల్లో నిర్మించనున్న ఆరు ఆర్థిక నగరాల్లో కల్పించాల్సిన వౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలపై చర్చించారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆరు ఆర్థిక నగరాల వలన సుమారు 1.64 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని సిఎస్ చెప్పారు. ఈ ఆర్థిక నగరాల్లో నిర్మించనున్న 90వేల గృహాల్లో 75వేల గృహాలు ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజి కింద చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక నగరాల నిర్మాణం వల్ల రాష్ట్ర స్థూల ఆదాయం 3.7 శాతం పెరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, వౌలిక సదుపాయాలు, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.