ఆంధ్రప్రదేశ్‌

వివిధ వర్సిటీల ప్రొఫెసర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. నాగార్జున వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఎం.విజయలక్ష్మి, ఎంవి రామ్ కుమార్ రత్నం, ఎయుకు చెందిన ఆర్.డి సంపత్ కుమార్, కె.కామేశ్వరరావు, ఎస్.వి.నాయుడు, నన్నయ వర్సిటీకి సంబంధించి పి.విజయనిర్మల, జెఎన్‌టియు(ఎ)కు చెందిన ఇ.కేశవరెడ్డి, బి.దుర్గా ప్రసాద్, జెఎన్‌టియు(కె)కు చెందిన జి.ఏసురత్నం, డి.కోటేశ్వరరావు, కృష్ణదేవరాయ వర్సిటీకి చెందిన కె.రాఘవేంద్రరావు, డి.సరళ కుమారి, పద్మావతీ మహిళా వర్సిటీ నుంచి పి.ఉమా మహేశ్వరీ దేవి, బి.విజయలక్ష్మి, ఎస్‌వికి చెందిన డివిఆర్ సాయి గోపాల్, జిఎన్ ప్రదీప్‌కుమార్, పి.మోహనరెడ్డి, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీకి చెందిన జె.సురేష్, డి.రాణఇ ప్రమీల, జిఆర్‌కె శర్మ, స్విమ్స్ నుంచి ఆలోక్ సచన్, కె.మాధవి, ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీకి చెందిన పి.ప్రసూనరాణి, బివిఎస్ ప్రసాద్, ఎంవిఎస్ నాయుడు, రాయలసీమ వర్సిటీ నుంచి సివి కృష్ణారెడ్డి, వేమన వర్సిటీ నుంచి పుట్టా పద్మ, ఎన్‌టిఆర్ హెల్త్ వర్సిటీ నుంచి కె.శంకర్‌ను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిలియేటెట్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.