ఆంధ్రప్రదేశ్‌

భవిష్యత్ పునరుత్పాదక శక్తిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: భవిష్యత్తు పునరుత్పాదక శక్తిదే (రిన్యూబుల్ ఎనర్జీ) అని ఆంధ్ర ప్రదేశ్ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) చైర్మన్ అజయ్‌జైన్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం నెడ్‌క్యాప్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్ మాట్లాడుతూ 2019 నాటికి ఎనర్జీ రంగంలో వచ్చే లోటును అధిగమించేందుకు విండ్, సోలార్ ఎనర్జీ ద్వారా సమర్థవంతంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళదామన్నారు. ఎనర్జీ విధానంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మంచి ఫలితాలను సాధించగలుగుతున్నామన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నెడ్‌క్యాప్ రాష్ట్ర కార్యాలయం ద్వారా మరింత సమష్టి కృషితో పనిచేయాలని అజయ్‌జైన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్నమైన నూతన పోకడల విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా రాష్ట్రానికి రూ.30వేల కోట్లు వచ్చాయని అవి కూడా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలుగా పరిగణించే రాయలసీమలో రావడం మంచి పరిణామం అన్నారు. తద్వారా 18వేల నుంచి 20వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగామన్నారు. వ్యవసాయ రంగంలో అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల ఇప్పటికే 15వేల సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయగలిగామన్నారు. తద్వారా దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. రైతుల్లో సోలార్ పంపుసెట్ల విధానంలో ఉన్న అపోహ తొలగిపోతోందని, మరింతగా వారికి అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పగటిపూట ఉదయం 7 నుండి సాయంత్రం 5వరకు పంట పొలాలకు నీరు అందించడం సాధ్యమవుతుందన్నారు. సోలార్ పునరుత్పత్తి శక్తిని నిక్షిప్తం చేసేందుకు (స్టోరేజ్) సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ఆ దిశలో వినూత్నమైన ఆలోచన చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,200 కోట్లు తెలంగాణ నుంచి రావాల్సి ఉందని, ఈ మేరకు బొగ్గు సరఫరా చేయవలసిందిగా కోరగా కొందరు అడ్డంకులను సృష్టిస్తున్నారన్నారు. 2019 నాటికి వచ్చే విద్యుత్ లోటును రిన్యూబుల్ ఎనర్జీ ద్వారా పూర్తిస్థాయిలో అధిగమించాలన్నారు.