ఆంధ్రప్రదేశ్‌

పినాకినికి తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 4: విజయవాడ నుండి చెన్నై వెళ్ళే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మల్లెపాడువద్ద పెద్ద ప్రమాదం తప్పింది. పట్టా విరిగిన విషయాన్ని గమనించిన డ్రైవర్ వేగాన్ని తగ్గించి నెమ్మదిగా రైలును నిలిపి వేశాడు. విజయవాడ నుండి చెన్నై వెళ్ళే పినాకినీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం ఉదయం 6.30గంటలకు తెనాలికి చేరుకుంది. రెండు నిమిషాల హాల్టు అనంతరం తెనాలి నుండి బయలుదేరిన రైలు రెండు కిలోమీటర్ల దూరంవెళ్ళిన తరువాత అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఎందుకు రైలు ఆగిందో తెలియని ప్రయాణికులు కంగారు పడ్డారు. మల్లెపాడు గేటు సమీపంలో రైలుపట్టా విరిగిఉండటాన్ని గమనించిన డ్రైవర్ వేగం తగ్గించి రైలును నిలిపివేశాడని తెలుసుకొని ఆందోళనకు గురైయ్యారు. తెనాలి నుండి బయలుదేరిన రైలు క్రమంగా వేగం పుంచుకునే సమయంలో మల్లెపాడు గేటు సమీపానికి రాగానే ముందున్న ఇంజన్ దాటిన తరువాత పెద్దశబ్దం వినిపించటంతో, అనుమానం వచ్చి వేగాన్ని తగ్గించి రైలును నిలిపివేసినట్టు డ్రైవర్ చెప్పాడు. అయితే అప్పటికే విరిగిన పట్టాను ఇంజనుతోపాటుగా ఐదు పెట్టలు దాటిపోయాయి. ఇంజన్ నుండి కిందకు దిగిన డ్రైవర్ పట్టాను పరిశీలించుకుంటూ వస్తున్న సమయంలో ఎస్-5 నెంబరు పెట్టెవద్ద రైలు పట్టా విరిగిపోయినట్టు గ్రహించి ఉన్నాతాధికారులకు సమాచారం అందించాడు. 10 నిమిషాల్లో సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న తెనాలి రైల్వే ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు వెంటనే ట్రాక్‌కు తాత్కాలిక మరమ్మతులుచేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేయటంతో సుమారు 40నిమిషాల తరువాత పినాకినీ చెన్నైవైపునకు బయలుదేరి వెళ్లటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉండగా ఈసంఘటనలో మరో కథనం కూడా వినవస్తోంది. తెనాలి స్టేషన్ పరిధిలోని రైల్వే కీమెన్ పట్టా విరిగిన విషయాన్ని ముందుగానే గ్రహించాడని, అతని సూచనల మేరకే డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేసినట్టు చెబుతున్నారు. అయితే గతంలో వెల్డింగ్‌చేసిన చోట విరిగిందా, మద్యలో విరిగిందాఅన్న విషయంపై వివరాలు వెల్లడించేందుకు అక్కడికి చేరుకున్న అధికారులు విముఖుత వ్యక్తం చేశారు. అలాగే రైలు డ్రైవర్, సంబంధిత కీమెన్ కూడా వారిపేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు.

చిత్రం.పట్టా విరిగినచోట మరమ్మత్తులు చేస్తున్న రైల్వే కార్మికులు