ఆంధ్రప్రదేశ్‌

‘జలసిరికి హారతి’కి జనమంతా రావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 4: జలసిరికి హారతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. సోమవారం ఉదయం విజయవాడలోని జల వనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వంశధార, పెన్నా, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 40,817 చెరువులు, 57,957 చెక్‌డ్యాంలు, ఫామ్ పాండ్స్, నీటి కుంటలు 6,17,718 తవ్వామని, పెర్కులేషన్ ట్యాంక్స్ 5,463 తవ్వగా, 1130 పనులను వివిధ స్కీమ్స్ కింద రైతాంగానికి మేలు జరిగే విధంగా చేశామని, 15 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వామని ప్రతి ఒక్కరూ ఈ జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యలమంచిలి శారదా నదిపై కట్టిన ఆనకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 7వ తేదీన జలసిరి హారతిలో పాల్గొంటారన్నారు. మెట్ట ప్రాంతాల్లోని 4,80,000 ఎకరాల ఆయుకట్టుకు స్థిరీకరణ వస్తుందన్నారు. గోదావరి నదిపై రెండు లిఫ్ట్‌ల ద్వారా చింతలపూడి ప్రాజెక్టు ద్వారా మైలవరంలోని మద్దాలపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయడంతో పాటు జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్కడ నుంచి రాజమండ్రిలో 7వ తేదీ సాయంత్రం నిర్వహించే అఖండ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయడానికి ముఖ్యమంత్రి మహాసంకల్పం చేసి సంవత్సరంలోపు పట్టిసీమ ద్వారా తీసుకువచ్చారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గర 830 కోట్ల రూపాయలతో చేపట్టే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులకు 8వ తేదీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని, దీని ద్వారా 50వేల ఎకరాలకు నీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడ నుంచి బయలుదేరి, సాయంత్రం 5 గంటలకు పవిత్ర సంగమం వద్ద నిర్వహించే జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తిచేసి దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ప్రక్రియకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశానికి దారితీశారన్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా చేసేందుకు నదుల అనుసంధానాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం దేశానికే ఆదర్శవంగా నిలుస్తుందన్నారు. ఇప్పటివరకు కోస్తా ఆంధ్రాలో 477 మిల్లీమీటర్లకు గాను 517 ఎంఎం వర్షపాతం పడగా, రాయలసీమలో కూడా 3.8 శాతం వర్షపాతం ఎక్కువగా పడిందన్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 2.58 శాతం మీటర్లు వర్షపాతం భూగర్భ జలాలుగా మారాయని, 232 టిఎంసిలు భూగర్భ జలాల మట్టం పెరిగిందన్నారు. గోదావరి జలాలు ఈ సీజన్‌లో 690 టిఎంసిలు సముద్రంలోకి వెళ్లగా, 82 టిఎంసిలు మాత్రమే గోదావరి డెల్టా ఉపయోగించుకుందని, పట్టిసీమ ద్వారా 47.15 టిఎంసిలు మాత్రమే వాడుతున్నామన్నారు.