ఆంధ్రప్రదేశ్‌

వాగులో కొట్టుకుపోయిన రైతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 5: కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలో మంగళవారం కుందరవాగులో ఓ రైతు కొట్టుకుపోయాడు. ఇది గమనించిన ఇంజేడు గ్రామస్థులు తాడు సాయంతో రైతును రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామానికి చెందిన రైతు గొల్ల దస్తగిరి పొలం వద్దకు వెళ్లేందుకు ఇంజేడు వద్ద ఉన్న కుందరవాగును దాటే ప్రయత్నం చేశాడు. అప్పటికే వాగులో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. కొద్దిదూరం వెళ్లాక ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు రక్షించుకున్నాడు. గమనించిన ఇంజేడు గ్రామస్థులు తాడు సాయంతో రైతును రక్షించి ఒడ్డుకు చేర్చారు.

చిత్రం..వాగులో చిక్కుకున్న రైతును తాడు సాయంతో రక్షిస్తున్న గ్రామస్థులు