ఆంధ్రప్రదేశ్‌

బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటిన రోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 21: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తీవ్ర తుపాను శనివారం సాయంత్రం 3.30 గంటలకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వద్ద తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఐజ్వల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమై ఉంది. ఆ తరువాత దక్షిణ నైరుతి దిశగా కదులుతూ బలహీన పడుతుందని తెలిపారు. దీంతో రాష్ట్రానికి తుపాను ప్రభావం లేదని తెలిపారు. కానీ సాధారణ వర్షాలు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.