ఆంధ్రప్రదేశ్‌

కరవు నివారణకు 500 కోట్ల రుణసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి (ఐఎఫ్‌ఎడి), రాష్ట్ర ప్రభుత్వం మధ్య గురువారం ఢిల్లీలో కీలక ఒప్పందం జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యవసాయ శాఖకు సుమారు రూ. 500 కోట్ల రుణం అందనుందని, రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ శాఖకు అంతర్జాతీయ సంస్థతో ఇదే తొలి ఒప్పందమని తెలిపారు. రాయలసీమ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు, దీనికి మరో రూ. 500 కోట్లను నాబార్డు, నరేగా కార్యక్రమం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించాలని ఒప్పందంలో భాగంగా ఉన్నదని తెలిపారు. నాలుగు రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని లక్షా, 65వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందన్నారు.వర్షాభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. 25 ఏళ్ల కాల పరిమితి, 5 ఏళ్ల గ్రేస్‌తో మొత్తం 30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే సమక్షంలో ఐఎఫ్‌ఎడి ప్రతినిధి ఆశా ఒమర్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఒప్పందం పత్రాలపై సంతకం చేశారు.