ఆంధ్రప్రదేశ్‌

తెలుగు ప్రజల అభ్యున్నతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో విదేశాలలోని తెలుగువారిని భాగస్వాముల్ని చేయటమే గాక స్వస్థలాలకు వచ్చినపుడు వారు ఎలాంటి సమస్య ఎదుర్కోకుండా తగిన విధంగా సహాయపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపిఎన్నార్టీ సొసైటీ) సిఇఓ డా.రవికుమార్ వేమూరు తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపి ఎన్టార్టీ సొసైటీ) వివరాలను సిఇఓ డా.రవికుమార్ వేమూరు తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో నివసిస్తున్న సుమారు 40 లక్షల మంది తెలుగువారికి ఐక్యవేదికను స్థాపించి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు రిజిస్ట్రేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపి ఎన్టార్టీ సొసైటీ) స్థాపించామన్నారు. మాతృభూమి పట్ల వారికున్న మమకారాన్ని నిజరూపమిస్తూ రాష్ట్భ్రావృద్ధిలో వారి తోడ్పాటును స్వీకరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారన్నారు. విదేశాల్లోని తెలుగువారి అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి వారి అవసరాలు తీర్చటంతో పాటు పలు సేవలను సొసైటీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
ప్రంచ స్థాయి ప్రమాణాలు గల అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించి, అత్యాధునిక సాంకేతిక వసతులున్న స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అమరావతిలో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్‌ఆర్‌టి సహకారంతో ఎన్‌ఆర్‌టి ఐకాన్ పేరున భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు సిఇఓ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించాలని ఉత్సాహం ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అనుమతుల ప్రక్రియలోని నిబంధనల సంక్లిష్టత, ఇబ్బందులు కారణంగా పారిశ్రామిక వేత్తలు ముందుకు రావటం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సొసైటీలోని పెట్టుబడుల విభాగం సహకారంతో ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలకు చెందిన 76కంపెనీలు రాష్ట్రంతో వ్యాపార పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. త్వరలో ఆయా కంపెనీలు అమరావతిలో భవనాల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం, పర్యాటక రంగాలలో పెట్టుబడులకు ఎన్‌ఆర్‌టిలను ఆహ్వానించేందుకు పెట్టుబడుల విభాగం కొత్త ప్యాకేజీలను త్వరలో ప్రకటించనున్నదన్నారు. ఎపి ఎన్నార్టీ సొసైటీ ఇదివరకే పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం, మార్కెటింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు, పద్ధతుల సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. సొంత ఊరు రుణం తీర్చుకోవాలని ఆకాంక్షించే ఎన్‌ఆర్‌టిలు పలు సందేహాలతో ముందుకు రాలేకపోతున్నారన్నారు. గ్రామ అవసరాలు తెలుసుకుని, ఆర్థిక సహాయం అందించటం, పన్ను మినహాయింపు, వారి సేవలు గ్రామాలలో అందుతున్న విధానం స్మార్ట్ఫోన్, వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునేందుకు వీలుగా ఎపి ఎన్టార్టీ సొసైటీలో స్మార్ట్ విలేజెస్ విభాగం పనిచేస్తుందన్నారు. నేటి వరకు 390కు పైగా ఎన్‌ఆర్‌టిల స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ద్వారా గ్రామాలలో సేవలు అందిస్తున్నారన్నారు.