ఆంధ్రప్రదేశ్‌

నిబంధనలు పాటించని వ్యవసాయ కళాశాలల అనుమతి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అనుమతి లేకున్నా, నిబంధనలు పాటించని వ్యవసాయ కళాశాలను చేస్తామని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తిరుపతి శివారు తుమ్మలగుంటలోని ఎంఎస్ స్వామినాథన్ అగ్రకల్చరల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అక్కడ వౌలిక వసతులు లేమిని గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలేజీని రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన రామచంద్రాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ఏడు ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలం, ప్రయోగశాల, పరికరాలు ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు కూడా తప్పనిసరి అన్నారు. సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వ అనుమతులు లేకపోతే అలాంటి వ్యవసాయ కళాశాలకు గుర్తింప ఇవ్వబోమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.