ఆంధ్రప్రదేశ్‌

విశాఖపట్నంలో రూ.600 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తుపాను,ప్రకృతివైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా విశాఖపట్నంలో రూ. 600 కోట్ల వ్యయంతో భూగర్భ విద్యుత్ పంపిణీ వ్యవస్ధను ఏర్పాటు చేయనున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో తుపాను గాలుల వల్ల అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్ధపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్షించారు. అనంతరం అజయ్ జైన్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు రూ. 400 కోట్ల ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. విశాఖపట్నంలో ఏడు వేల కి.మీ భూగర్భ విద్యుత్ వ్యవస్ధను ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. రాష్ట్రంలో తుపాను గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, ప్రస్తుతం వందశాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. విద్యుత్ వ్యవస్ధ అతలాకుతలమైనప్పుడు వెంటనే పునరుద్ధరించేందుకు వీలుగా రూ. 40 కోట్ల పెట్టుబడులతో ఎమర్జన్సీ రెస్టోరేషన్ టవర్ల సెట్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ సదుపాయాన్ని నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో నెలకొల్పినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాకు 1078 గ్రామాల్లో అంతరాయం కలిగిందని, ప్రస్తుతం అన్ని చోట్ల మరమ్మత్తు పనులు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.