ఆంధ్రప్రదేశ్‌

‘వైఎస్‌ఆర్ కుటుంబం’ శిక్షణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా వైకాపా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 11న ప్రారంభమయ్యే కార్యక్రమానికి సంబంధించి దాదాపు 4.3 లక్షల కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా పార్టీ సభ్యత్వం ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకుని, ఆ మేరకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో ఆయా నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, స్థానిక నేతలకు శిక్షణ ఇచ్చారు. ప్రచారంలో ఉపయోగించాల్సిన కిట్ ఒకటి ఈ సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చారు. ఇళ్లపై అంటించేందుకు వీలుగా పార్టీ స్టిక్కర్లు, సభ్యత నమోదు ఫారాలు, జగన్ విజిటింగ్ కార్డులు ఆ కిట్‌లో ఉంచారు. తమ పేర్లను వైఎస్‌ఆర్ కుటుంబంలో నమోదు చేసుకునేందుకు వీలుగా 91210-91210 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. సభ్యులుగా నమోదైన వారు తమ సమస్యలు తెలియచేసేందుకు నేరుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నేరుగా సంప్రదించే వీలు కలుగుతుంది.