ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ఇన్నోవేషన్ ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వ ఐటి విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని ఇండియన్ ఇన్నోవేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎఎస్ రావు తెలిపారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఇటువంటి సదస్సులు ఉపకరిస్తాయన్నారు. క్రియేటివ్ ఇన్నోవేటర్లను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సదస్సును నిర్వహించడం భారత్‌లో ఇదే ప్రథమమని తెలిపారు. చైనా, జపాన్ తదితర దేశాల నుంచి పెద్దఎత్తున ఐటి ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత్‌లో ఐటి రంగాన్ని విస్తృత పరిచేందుకు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అంతర్జాతీయ సదస్సులు ఉపకరిస్తాయన్నారు. భారత్‌లో పారిశ్రామిక వేత్తలకు సాంకేతిక సహకారంతో పాటు నూతన ఉత్పత్తులకు పేటెంట్ రక్షణ కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఇతర దేశాలకు చెందిన కంపెనీల సాంకేతికతను, మన దేశంలో పారిశ్రామిక రంగానికి ఇప్పించేందుకు వీలుగా విదేశీ కంపెనీలకు, స్థానిక ఉత్పత్తిదార్లకు మధ్య సంధాన కర్తగా సంస్థ పనిచేస్తుందన్నారు. ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో భాగంగా ఈ నెల 10న ‘సపోర్టింగ్ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ అంశంపై యనైటెడ్ స్టేట్స్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 11న ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు , కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి వైఎస్ చౌదరి తదితరులు పాల్గొంటారని, ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక ఐటి పరిశోధకులకు సిఎం చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారన్నారు. సమావేశంలో ఎపి ఇన్నోవేటివ్ సొసైటీ సిఇఓ ప్రొఫెసర్ వల్లీకుమారి, లెబెనాన్ ఇన్నోవేటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నౌర్ ఎయిడ్ లాటస్, చైనా ఇన్నోవేషన్స్ అసోసియేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ జెంగ్పీ జుయాన్ పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్టాడుతున్న కలెక్టర్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్