ఆంధ్రప్రదేశ్‌

టిటిడి చైర్మన్‌గా సిఎం రవిశంకర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 8: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వేంకటేశ్వర్వస్వామి ఆలనపాలన చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసే ధర్మకర్తల మండలికి చైర్మన్ పదవి చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సిఎం రవిశంకర్‌ను వరించే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్నటివరకు నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు పేరు వినిపించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో శుక్రవారం నాడు రవిశంకర్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉన్న ధర్మకర్తల మండలి గడువు ముగిసినప్పటి నుంచి సీఎం రవిశంకర్ పేరు ప్రముఖంగానే వినపడుతూ వచ్చింది.
అయితే టిడిపి ఎంపిలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావులతో పాటు నందమూరి హరికృష్ణ, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, బీద మస్తాన్ రావు, పేర్లు ప్రముఖంగా విన్పించాయి. ఈనేపధ్యంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిలుగా ఉన్నవారిని టిటిడి చైర్మన్‌గా నియమించనని సీఎం చంద్రబాబు స్పష్టంగా తేల్చిచెప్పడంతో చైర్మన్ రేసులో రవిశంకర్, నందమూరి హరికృష్ణ, నెల్లూరుకు చెందిన మస్తాన్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో టిటిడి పాలకమండలి సంబంధించి సిఎం చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
చైర్మన్ పదవి ఆశించేవారి సంఖ్య భారీగా ఉన్నప్పటికీ చివరకు సిఎం చంద్రబాబు రవిశంకర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. శనివారం జరిగే కేబినేట్ సమావేశంలో టిటిడి పాలకమండలి చైర్మన్ విషయమై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలావుండగా 19మంది సభ్యులతో కూడుకున్న టిటిడి పాలకమండలిలో గత బోర్డులో కొన్నినెలల ముందు బోర్డు సభ్యురాలిగా నియమితులై సుధానారాయణమూర్తికి తిరిగి మరోసారి అవకాశం కల్పించనున్నారు. చిత్తూరు జిల్లా నుంచి భానుప్రకాష్‌రెడ్డి, బోత్ ఆసుపత్రి అధినేత పవన్‌కళ్యాణ్ అనుచరుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఎంటిఆర్ రాజు(రామచంద్రరాజు), అదేవిధంగా సాయిసుధా ఆసుపత్రి అధినేత్రి డాక్ట ర్ సుధారాణిలతో పాటు బిజెపికి చెందిన కోలా ఆనంద్ బోర్డు సభ్యుల స్థానానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.