ఆంధ్రప్రదేశ్‌

పండిట్ శివకుమార్ శర్మకు కొప్పరపుకవుల పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 8: సంతూర్ వాద్య పరికర సృష్టికర్త, పద్మవిభూషణ్ పండిట్ శివకుమార్ శర్మకు ప్రతిష్ఠాత్మక కొప్పరవు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం ప్రకటించారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శనివారం జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నట్టు పురస్కార కార్యక్రమ నిర్వాహకుడు మా శర్మ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఇదే సందర్భంలో కొప్పరపు కవుల అవధాన పురస్కారాన్ని ప్రొద్దుటూరుకు చెందిన నరాల రామారెడ్డిని ఎంపిక చేసినట్టు తెలిపారు. కొప్పరపు జాతీయ పురస్కారాన్ని గతంలో పండిట్ జస్రాజ్‌కు, 2015లో వేణుగాన శిఖామణి పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్‌కు, 2016లో మాడుగుల నాగఫణిశర్మకు అందజేశారు. అంతకు ముందు ఈ పురస్కారాన్ని వేటూరి సుందరరామ మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, మేడసాని మోహన్, మల్లాది చంద్రశేఖర శాస్ర్తీ, మంగళంపల్లి బాలమురళి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గరికపాటి నరసింహారావు, కె విశ్వనాథ్, నేదునూరి కృష్ణమూర్తి తదితర ఉద్దండులు అందుకున్నారు. శనివారం జరిగే పురస్కార ప్రధాన కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కుర్తాళం పీఠాధిపతి, పరివాజ్యకాచార్య సిద్దేశ్వరానంద భారతి అనుగ్రహ భాషణ చేస్తారని పేర్కొన్నారు. కొప్పరపు కవుల పద్యాలను విజయనగరం ప్రాంతానికి చెందిన కర్ణాటక, లలిత సంగీత విద్యాంసుడు బిఎ నారాయణ మధురంగా ఆలపించి అలరిస్తారన్నారు.