ఆంధ్రప్రదేశ్‌

ప్రజల ముందు సాష్టాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 9: దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ‘ఇంటింటికీ టిడిపి’ పేరుతో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కుటుంబం పేరుతో వైకాపా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టుకునేందుకు శ్రమించనున్నాయి. అక్టోబర్ 31వ తేదీ వరకూ ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలుగుదేశం నిర్ణయించగా, వైకాపా అక్టోబర్ 26వ తేదీ వరకూ నిర్వహించాలని భావిస్తున్నా ఆ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర కార్యక్రమం తుదిరూపు దాల్చిన తరువాత ఖచ్చితమైన తేదీ ప్రకటిస్తారని సమాచారం. అధికారంలో ఉన్న టిడిపి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గత మార్చిలో నిర్వహించింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 55 లక్షల మంది సభ్యులు టిడిపిలో చేరారు. ఇక వైకాపా ఏడాది క్రితం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సుమారు 30 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కాగా ఇంటింటికీ టిడిపి పేరుతో జనంలోకి వెళ్తున్న అధికార పార్టీ ప్రధానంగా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తుందని నాయకులు వెల్లడించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పరంగా అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబానికి అందుతున్నాయా లేదా అన్నది తెలుసుకుంటారు. అర్హత ఉన్న వారికి పింఛను, రేషన్ కార్డు, పొదుపు మహిళకు రుణ రాయితీ, రైతులకు రుణమాఫీ మొత్తం అందిందా లేదా అన్నది ప్రధానంగా తెలుసుకుంటారు. అదే సమయంలో గ్రామంలో తాగునీరు, అంతర్గత రహదారులు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి వంటి సమస్యలు ఉంటే వాటి వివరాలు సేకరించి వాటిని ఆయా మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, శాసనసభ, శాసనమండలి, పార్లమెంటు సభ్యులు సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.ఇక ప్రతిపక్ష పార్టీ వైకాపా ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించనుంది. వైఎస్‌ఆర్ కుటుంబ కార్యక్రమాన్ని ఈనెల 2వ తేదీ ఇడుపులపాయలో పార్టీ అధినేత జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక సెల్‌ఫోన్ నెంబర్ ఇచ్చి వైఎస్‌ఆర్ కుటుంబంలో చేరాలనుకున్న ప్రజలు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న 4.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పార్టీ ఇచ్చిన సెల్ నెంబర్‌కు వచ్చిన మిస్డ్ కాల్స్ ఆధారంగా ఆయా ఫోన్లకు తిరిగి పార్టీ నాయకులు ఫోన్ చేసి వారి ఇంటికి వెళ్లి వైఎస్‌ఆర్ కుటుంబంలో చేర్చుకోనున్నారు. ఇలా రాష్ట్రంలో కోటి మందిని వైకాపా సభ్యులుగా నమోదు చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన మరునాడే పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ఇడుపులపాయలో ప్రారంభం కానుంది. ఆయన తన యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కుటుంబంలో చేరిన వారిని ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారి సహాయం కోరుతారని పార్టీ నాయకులు తెలిపారు. ఏడాదిన్నర తరువాత వచ్చే ఎన్నికలకు రెండు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధం కావడంతో ఇక రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంటుందని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.