ఆంధ్రప్రదేశ్‌

ఉక్కును ఆదుకున్న వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 21: తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కుకు తాజా వర్షాలు ఊపిరి పోశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా ఏలేరు కాలువ నుంచి 100 మిలియన్ గేలన్స్ పర్‌ఎడే (ఎంజిడి)ల నీరు అదనంగా వచ్చి చేరింది. దీంతో ఇప్పకే నిలిపివేసిన కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తిని పునః ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి రుతుపవనాల ప్రభావం ప్రారంభమవుతుందన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆశలు రేకెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి రోజూ అవసరమయ్యే 35 ఎంజిడిల నీటిని ఏలేరు కాలువ ద్వారా విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కో) సరఫరా చేస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఉక్కుకు నీటి సరఫరాలో భారీ లోటు చోటుచేసుకుంది. గోదావరి, ఏలేరు రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేశారు. ఆయా వనరుల్లో కొద్ది రోజుల కిందట పంపింగ్‌కు సైతం నీరు అందుబాటులో లేకపోవడంతో సరఫరాను తగ్గించారు. దీంతో 60 రోజుల నిల్వ సామర్థ్యం కలిగిన కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కెబిఆర్)లో నీరు అడుగంటి, నిల్వ సామర్థ్యం 20 రోజులకు పడిపోయింది. నిల్వల నీటితో కర్మాగారాన్ని కొద్ది రోజులు నడిపిన ఉక్కు యాజమాన్యం చివరకు, ఉత్పత్తిని తగ్గించుకుని నీటిని పొదుపుగా వాడుకుంటూ వచ్చింది. ఇదే సందర్భంలో ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు ప్రత్యామ్నాయంగా తాండవ, రైవాడ జలాశయాల నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం భావించింది. అయితే తాండవ, రైవాడ రిజర్వాయర్ల ఆయకట్టు రైతులు వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు సైతం రైతుల ప్రయోజనాలే ముఖ్యం అంటూ మోకాలడ్డారు. ఇక భవిష్యత్ మీద ఆశలు సన్నగిల్లిన ఉక్కు యాజమాన్యం దేవునిపైనే భారం వేసింది. అనుకోని వరంలా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో రెండు రోజుల పాటు పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో ఆశలు చిగురించాయి.