ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఎ అభివృద్ధి పనులకు మినహాయింపు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో సిఆర్‌డిఎ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలని జిఎస్‌టి కౌన్సిల్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా అనేక అభివృద్ధి పనులను సిఆర్‌డిఎ చేపడుతోందని, మినహాయింపు ఇవ్వకపోవడం వల్ల ఖజనాపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కాంట్రాక్టు పనులకు పన్నును 18శాతం నుంచి 12 శాతం తగ్గించాలని కోరారు. కార్మికులతో చేపడుతున్న కాంట్రాక్టు పనులకు పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రకాల రిటర్న్‌ల ఫైలింగ్‌కు సమయం పెంచాలని తెలిపారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రెవెన్యూ నష్టపరిహారాన్ని సెప్టెంబర్‌లో చెల్లించాలని జిఎస్‌టి కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీని కోరారు.