ఆంధ్రప్రదేశ్‌

‘చక్కెర’ రైతులకు తీపికబురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో 2014-15 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్దనున్న శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ (రూ.13.50 కోట్లు), అనకాపల్లిలోని వివిఆర్ కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ (రూ.1.99 కోట్లు) రైతులకు బకాయి ఉన్న మొత్తం రూ.15.49 కోట్లును ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. దీంతోపాటు గుంటూరు జిల్లాలోని జంపని గ్రామం వద్ద ఉన్న నన్నపనేని వెంకట్రావు అండ్ ఆలపాటి ధర్మారావు కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.2.25 కోట్ల జీతాలను విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. కొవ్వూరు, చిత్తూరుల్లో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ప్రభుత్వం ఒక కమిటీని వేసి, ఇఫ్కోతో కలిసి చర్యలు తీసుకునేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందని తెలిపారు.