ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలు మినీ మహానాడులో రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 21: ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి మినీమహానాడు రచ్చయంది. కరణం బలరాం, గొట్టిపాటి వర్గీయులు మధ్య తోపులాట, పార్టీ పరిశీలకులు బుచ్చయ్యచౌదరి గన్‌మెన్‌ను బలరాం నెట్టడటంలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ అధ్యక్షతన జరిగింది. జిల్లా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాష్టమ్రంత్రులు శిద్దా రాఘవరావు, రావెల కిశోర్‌బాబు సమక్షంలోనే రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు, అద్దంకి మాజీ శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి . ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీనేతల్లో నెలకొంది. ముందుగా సభాకార్యక్రమానికి చేరుకున్న బలరాం, ఆయన అనుచరులు అక్కడ ఉండగానే మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యనాయకులందరు సభావేదికపై ఎక్కటంతో కింద ఉన్న బలరాంను ఆయన వర్గీయులు బలరాంను వేదికపైకి పిలవరా అంటూ వాదనకు దిగారు. బలరాం జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయటంతో, ప్రతిగా గొట్టిపాటి వర్గీయులు కూడా నినాదాలు చేశారు. బుచ్చయ్య చౌదరి కలుగచేసుకుని బలరాం పైకి రావాలని ఆహ్వానించారు. బుచ్చయ్యచౌదరిపై బలరాం మండిపడ్డారు. ఏం మేం గుర్తుకురావటం లేదా అంటూ చౌదరికి క్లాస్ బలరాం తీసుకున్నారు. బుచ్చయ్యచౌదరి మాత్రం బలరాంకు సర్దిచెప్పి వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతున్నంతసేపు బలరాం వర్గీయులు బలరాం జిందాబాద్ అంటూ, గొట్టిపాటి సభావేదికనుండి వెళ్ళిపోవాలంటూ నినాదాలు హోరెత్తించారు.. గొట్టిపాటి వర్గీయులు కూడా గొట్టిపాటి జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలుచేయటంతో బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్, బుచ్చయ్యచౌదరి కలుగచేసుని కార్యకర్తలకు సర్ధిచెప్పటం గొడవ సర్ధుమణిగింది. ఈసందర్భంగా బుచ్చయ్యచౌదరిస్పందిస్తూ ఎప్పటికైనా నాయకులందరు ఒకటేనని కార్యకర్తలుకూడా మీరంతా ఒకటిగా ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. గొట్టిపాటి మాత్రం ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా కేవలం తనకు ఇచ్చిన చంద్రబాబు టెక్నాలజిపైన మాత్రమే మాట్లాడిన అనంతరం సభావేదికనుండి వెళ్ళిపోయారు. బలరాం మాత్రం ఘాటైనపదజాలాలను ఉపయోగించారు. గత పదేళ్లల్లో కార్యకర్తలు ఎన్నోనష్టాలు, కష్టాలు చవిచూశారన్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు నష్టం జరిగితే సహించేది లేదన్నారు. కార్యకర్తలకు ఇబ్బందులుకలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలోకి కొత్తగా వస్తున్న నాయకులు కేవలం ప్యాకేజిల కోసం వస్తే మాత్రం ఫర్వాలేదు కాని వచ్చిన వారు మెడపైకి ఎక్కుతామంటే ఊరుకునేది లేదని పరోక్షంగా గొట్టిపాటిని ఉద్దేశించి హెచ్చరించారు.