ఆంధ్రప్రదేశ్‌

రోజాలా కాదు... పురంధ్రీశ్వరిలా మాట్లాడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 10: రాజకీయాల్లో రాణించాలనుకున్న మహిళలు ఎలా మాట్లాడకూడదో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత రోజాను చూసి, ఎలా మాట్లాడాలో బిజెపి నేత పురంధ్రీశ్వరిని చూసి నేర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచించారు. వీరిద్దరి మాటలు చూస్తే ఎలా ప్రవర్తించాలో ప్రజలకు ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన బిజెపి మహిళా కార్పొరేటర్లకు కాకినాడ నగరంలో ఆదివారం నిర్వహించిన సన్మాన సభకు మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించిన ముగ్గురు మహిళా కార్పొరేటర్లనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళల విజయంతో బిజెపి విజయ ప్రస్థానం ప్రారంభించిందన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఆయా అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి బిజెపి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ విజయం ఆరంభం మాత్రమేనని, ఈ విజయం సాధారణ కార్యకర్త ఘనతగా పేర్కొన్నారు. అపజయం పొందిన అభ్యర్ధులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. గెలిచిన కార్పొరేటర్లు నిరంతరం ప్రజా సంక్షేమానికి కృషి చేసిన పక్షంలో ప్రజలెవరూ మరచిపోరని, ఆదర్శవంతమైన నాయకుల ప్రవర్తనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కాకినాడ కార్పొరేషన్‌లో కనీసం బిజెపికి 5 సీట్లు గెలిచి వుంటే బాగుండేదని, ఎన్నికల్లో పార్టీ నేతలందరూ కలసికట్టుగా పనిచేశారని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుండి బిజెపి అభ్యర్థులు నేరుగా బరిలోకి దిగుతారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే స్థాయికి బిజెపి అభ్యర్ధులు ఎదగడం తథ్యమని జోస్యం చెప్పారు. కాకినాడ కార్పొరేషన్‌కు బిజెపి కార్పొరేటర్లుగా ఎన్నికైన నల్లబిల్లి సుజాత, గోడి సత్యవతి, సాలిగ్రామ లక్ష్మీప్రసన్నలను ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్సీ తదితరులు సత్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బిజెపి కార్పొరేటర్లను సత్కరిస్తున్న మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ వీర్రాజు