ఆంధ్రప్రదేశ్‌

దేవాలయాలకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల సహా ఇతర ప్రముఖ ఆలయాలకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐసిఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు, చార్టెడ్ అకౌంటెంట్ ఎం.దేవరాజు రెడ్డి చెప్పారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానసిక ప్రశాంతత కోసం, నమ్మకంతో దేవుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తుంటారని అన్నారు. వారిచ్చిన కానుకలతో తిరుపతి, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న విషయం పరిగణలోకి తీసుకోవాలన్నారు. భక్తులంతా జిఎస్టీని చెల్లిస్తున్నారని, తిరిగివారిపైన జిఎస్టీ మోపడం సరికాదన్నారు. వారిచ్చిన కానుకలతో నడుస్తున్న దేవాలయాలకు జిఎస్టీ వర్తింప చేయడం సరికాదన్నదే తన అభిప్రాయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తే దీనిని సాధించవచ్చని అన్నారు. పాఠశాలలకు సైతం జి ఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. దేశానికి ఉత్తమపౌరులను తీర్చిదిద్దుతున్న పాఠశాలలకు మినహాయింపు ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం జిఎస్టీ అమలుతో దేశంలోని సామాన్యులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తమేనని చెప్పారు. అయితే ఇది తాత్కాలికమేనని భవిష్యత్తులో అందరికి ఎంతో ఉపయోగకరమన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లకు నేడు దేశ,విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. దేశానికి ప్రస్తుతం 10 లక్షల మంది అవసరమైతే నేడు కేవలం 3లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. విదేశాల్లో దాదాపు 30వేల మంది భారతీయులు చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారని, 30 చాప్టర్లు కూడా ఉన్నాయని వివరించారు.