ఆంధ్రప్రదేశ్‌

విభజనతో మేలే జరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, సెప్టెంబర్ 11: విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలే జరిగిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లెలో పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ విభజనతో ప్రజలకు కేవలం పది శాతం మాత్రమే నష్టం జరిగిందని, 90 శాతం లాభం చేకూరిందన్నారు. విభజన జరుగకముందు రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేదని, విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.30 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. విభజనతో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇరురాష్ట్రాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పరిపాలనలో వైఫల్యం చెంది కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజన చేసిందని విమర్శించడం తగదన్నారు. ప్రత్యేక హోదా గురించి వైకాపా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలపై పీసీసీ విస్తృత సమావేశంలో సమీక్షిస్తామన్నారు. త్వరలో పిసిసి నూతన కార్యవర్గం ఎంపిక జరుగుతుందన్నారు. ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఏ ప్రాంతానికి వెళ్లినా దేశంలో కాంగ్రెస్ ఉంటేనే పేదలు, రైతులు, మైనార్టీలకు భరోసా ఉండేదన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. ప్రాంతీయ పార్టీలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకమన్నారు. గతంలో బిజెపితో పొత్తు ప్రసక్తేలేదన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే డైలాగును ఆయన గుర్తుచేసుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం, అందుకే ఇందిరమ్మరాజ్యం రాబోతుందన్నారు. సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ధృవకుమార్‌రెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.