ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 11: పెట్రోల్ బంకు ఏర్పాటుకు నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్(ఎన్‌ఓసి) ఇచ్చేందుకు గాను రూ. 10 వేలు లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ సుదర్శనరావు ఎసిబి అధికారులకు చిక్కాడు. రాయచోటిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. రాయచోటి మండలం కాటిమాయకుండకు చెందిన బి.శ్రీనివాసులుకు పెట్రోల్ బంక్ మంజూరైంది. బంక్ ఏర్పాటుకు గాను ఎన్‌ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్‌ఓసి ఇవ్వలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ సుదర్శనరావు డిమాండ్ చేశాడు. దీంతో శ్రీనివాసులు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం 10 వేలు లంచం ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ నాగరాజు సిబ్బందితో దాడులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.