ఆంధ్రప్రదేశ్‌

భూ సమీకరణ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 11: దేశంలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చేపట్టిన భూ సమీకరణ పథకం అద్భుతంగా ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి ఎస్‌కె మోదీ అభినందించారు. అమరావతి నగరానికి రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములు సమీకరించిన విధానంపై అధ్యయనానికి ప్రత్యేకంగా వచ్చిన ఆయన సోమవారం విజయవాడ ఏపి సిఆర్‌డిఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, ప్రత్యేక కమిషనర్ వి రామమనోహరరావు.. బీహార్ ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ల్యాండ్ పూలింగ్ స్కీంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధానికి భూ సమీకరణ అత్యంత వేగంగా నిర్వహించి, రైతులకు తిరిగి ప్లాట్లు కేటాయించడం పట్ల బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమైన అంశాలను స్వయంగా నోట్‌బుక్‌లో నమోదు చేసుకుంటూ ల్యాండ్ పూలింగ్ స్కీం అమలుపై ఆయన పలు సందేహాలు నివృత్తి చేసుకున్నారు. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ పూలింగ్ విధానం అమలులో ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 32వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించేందుకు పలు దఫాలుగా వారితో సమావేశమై వారికి ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించామని కమిషనర్ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు భూములిచ్చారని చెప్పారు. ప్లాట్ల కేటాయింపులో రైతులు ఇచ్చిన ఆప్షన్ల వివరాలు నమోదు చేసుకుంటూ ప్లాట్లు ఆ ప్రకారంగా విభజించి ఇవ్వడంలో సమస్యలు తలెత్తలేదా.. అని ఆయన వివరాలు తెలుసుకున్నారు. ప్లాట్ల కేటాయింపులో ఎలక్ట్రానిక్ లాటరీ విధానం అమలు చేశామని, వీటిని రైతులకు సిఆర్‌డిఎ రిజిస్ట్రేషన్ చేస్తోందని కమిషనర్ తెలిపారు. వార్షిక కౌలు (యాన్యుటీ) చెల్లింపు అంశంపై మోదీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రైతులు వ్యవసాయం వల్ల పొందే ఉత్పత్తుల విలువను శాస్ర్తియంగా లెక్కించి, ఆ ఆదాయం కోల్పోయినందున ప్రత్యామ్నాయంగా వార్షిక కౌలు చెల్లింపును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారని కమిషనర్ తెలియజేశారు. రైతు కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ చెల్లిస్తున్నామన్నారు. అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి అమరావతి రాజధాని నగర సందర్శనలో భాగంగా తొలుత వెలగపూడి ప్రభుత్వ భవనాల సముదాయంలోని అసెంబ్లీ భవనాన్ని సందర్శించారు. తర్వాత విట్ ఏపీ విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో సచివాలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలనటంతో అధికారులు సెక్రటేరియట్‌లోని సిఎంవోతో పాటు వివిధ బ్లాకుల్ని చూపించారు.

చిత్రం..సిఆర్‌డిఏ అధికారులతో బీహార్ ఉపముఖ్యమంత్రి ఎస్‌కె మోదీ భేటీ