ఆంధ్రప్రదేశ్‌

మూడు రోజుల శిశువుకు గుండె శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 21: మూడు రోజుల నవజాత శిశువుకు శస్తచ్రికిత్స చేసి వైద్యులు ప్రాణాలు కాపాడారు. ఒంగోలుకు చెందిన మూడు రోజుల శిశువుకు పుట్టుకతోనే గుండెజబ్బు ఉందని గుర్తించిన అక్కడి వైద్యులు గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సిఫార్సు చేశారు. శిశువుకు పరీక్షలు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీ్ధర్‌రెడ్డి గుండెకు రక్తం సరఫరా చేసే బృహద్ధమనికి సమస్య ఏర్పడిందని, దీంతో హృదయానికి వెళ్లే ప్రధాన రక్తనాళం సన్నబడి హృదయ స్పందనలు తగ్గినట్లు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమ్మతితో సన్నబడ్డ రక్తనాళానికి బయో అబ్జార్బబుల్ స్టెంట్‌ను అమర్చి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా శస్తచ్రికిత్స చేశారు. శిశువును ఒక్కరోజు వెంటిలేటర్‌లో ఉంచి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు శ్రీ్ధర్‌రెడ్డి, హరిత, జ్యోతి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు రోజుల శిశువుకు బయో అబ్జార్బబుల్ స్టెంట్‌ను అమర్చడం జరిగిందన్నారు. చిన్నపిల్లల గుండె శస్తవ్రిభాగంలో ఇప్పటివరకు 100 గుండె శస్తచ్రికిత్సలు పూర్తిచేసినట్లు తెలిపారు. వైద్యులను రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్‌బాబు అభినందించారు.

చిత్రం చిన్నారి, తల్లిదండ్రులతో వైద్యులు