ఆంధ్రప్రదేశ్‌

విలీన మండలాల సమస్యలకు త్వరలోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విలీన మండలాల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. చింతూరు మండలం చట్టి ఎంపిటిసి, ఎటపాక మండల జడ్పీటిసి, ఎటపాక ఎంపిపి స్థానాలకు ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. చింతూరు ఐటిడిఏ పరిధిలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రాజెక్టు అధికారి లేకపోవటంతో గిరిజనుల సమస్యలపై పట్టించుకునే వారు లేరన్నారు. ఎటపాక రెవెన్యూ డివిజన్ అధికారిని నియమించాలని, ప్రజలు పరిపాలనాపరమైన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని వారు ఆ వినతిపత్రంలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎటపాక మండలం రాయనపేట గ్రామంలో లిప్ట్ ఇరిగేషన్ పనులు, ఆంధ్ర - తెలంగాణ విభజన కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయాయని, సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చంద్రబాబును కోరారు. ముంపు ప్రాంతంలో లేని గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఉభయ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు విన్నవించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయటానికి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి విలీనం చేయించానని ఆయన గుర్తు చేశారు. ఈ మండలాల ప్రజల పూర్తి బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన చెప్పారు. ఇందుకోసమే చింతూరులో ఐటిడిఏను ప్రారంభించామని తెలిపారు. ఇటీవలే తాను ఈ ప్రాంతంలో పర్యటించానని వారికి గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో చింతూరు, ఎటపాక, గుండాల, చోడవరం, రామక్కపేట, వీసాపురం, గొమ్ము కొత్తగూడెం, తోటపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, గ్రామాల పెద్దలు కొమరం ఫణీశ్వరి, మాదిరెడ్డి కృష్ణబాబు, రావి మాధవరావు, ఎం రమేష్, పల్లంటి రమాదేవి, ఎన్ సూర్యనరాయణ చౌదరి, పాడిశ్యామల, కుసుమరాజు, పాలకుర్తి సరోజిని, దుద్దుకూరి వెంకటేశ్వర్లు ఉన్నారు.