ఆంధ్రప్రదేశ్‌

అధికారుల తీరుతో నష్టపోతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు/మంగళగిరి, సెప్టెంబర్ 14: రాజధాని ప్రాంతంలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటన రెండోరోజు కూడా కొనసాగింది. రాజధాని అమరావతి భూ సేకరణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు స్వయంగా పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. తొలిరోజు గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో పర్యటించిన ప్రపంచబ్యాంకు ప్రతినిధులు రెండోరోజు గురువారం మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో పర్యటించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి పలు గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఒక బృందం నిడమర్రు నుండి ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చేరుకోగా అసైన్డ్భూముల రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కృష్ణానది తీరంలోని పంట పొలాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు చూపించి, పట్టా భూముల రైతులతో సమాన ప్యాకేజీ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే తాము భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని వివరించారు. మరో బృందం లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించింది. బోరుపాలెంలో 3.74 ఎకరాలు, అబ్బరాజుపాలెంలో 49.54 ఎకరాలు, రాయపూడిలో 64.87 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 20.22 ఎకరాలను రెవెన్యూ అధికారులు జరీబు భూములుగా ప్రకటించి మూడు సంవత్సరాల పాటు కౌలు చెల్లించారు. జరీబు ప్యాకేజీ ప్రకారం ప్లాట్ల కేటాయింపు కూడా జరిగిన తర్వాత సిఆర్‌డిఎ అధికారులు కొత్తగా జీవో వచ్చిందంటూ తమ భూములకు మెట్ట ప్యాకేజీ ఇస్తామని ప్రకటిస్తున్నారంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. భూ సమీకరణకు స్వచ్చంధంగా భూములిచ్చిన తమకు అధికారుల తీరుతో అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రపంచ బ్యాంకు పరిశీలనా బృందం చైర్మన్ డీలా మార్టా రైతులకు సమాధానమిస్తూ రైతుల ప్రతి సమస్యను నమోదు చేసుకుంటున్నామని, ప్రజల అభివృద్ధి కోసమే ప్రపంచ బ్యాంకు పని చేస్తుందన్నారు.
లింగాయపాలెం గ్రామంలో రైతుల సమస్యలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నమోదు చేసుకుంటుండగా, కొందరు పోలీసులు సమావేశ ప్రాంతానికి చేరుకున్నారు. తమను బెదిరించేందుకే పోలీసులు రంగప్రవేశం చేస్తున్నారంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలనా బృందం పోలీసు చర్యలపై మండిపడుతూ రైతుల సమావేశ ప్రాంతానికి పోలీసులు రాకూడదని హెచ్చరించడంతో పోలీసులు దూరంగా వెళ్లి బందోబస్తు నిర్వహించారు. బేతపూడి పొలాల్లో మల్లెపూలు, జాజిపూలు పండించే రైతులు, పూలుకోసే రైతు కూలీలతోను మాట్లాడింది. రాజధాని కోసం భూములివ్వని రైతులనుంచి భూ సేకరణ పద్ధతిద్వారా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తాము నమ్ముకున్న భూములను ఇచ్చే ప్రశే్న లేదని రెండు గ్రామాల రైతులు స్పష్టంచేశారు.

చిత్రం..బేతపూడిలో పూలరైతులతో మాట్లాడుతున్న బృందం