ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 16: వనం -మనం కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. శనివారం వనం -మనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీని కలెక్టరేట్ ఎదుట మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వనం-మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈకార్యక్రమం రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో నవంబర్ నాలుగో తేదీ వరకు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం 23 శాతం పచ్చదనం ఉందని, దానిని 50 శాతానికి పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈకార్యక్రమాన్ని చేపట్టారన్నారు.