ఆంధ్రప్రదేశ్‌

సంగమేశ్వరాన్ని చుట్టుముట్టిన కృష్ణాజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, సెప్టెంబర్ 16: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరాలయాన్ని శనివారం కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నీరు ఒక్కసారిగా ఆలయాన్ని చుట్టుముట్టాయి. దీంతో గర్భగుడిలోని వేపదారు శివలింగం నీట మునిగింది. దీంతో చివరి సారిగా ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ మహాహారతి ఇచ్చారు. సాధారణంగా శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్ తగ్గుముఖం పట్టగానే నదీగర్భంలోని సంగమేశ్వరాలయం మార్చి నెలలో బయటపడుతుంది. అనంతరం వర్షాకాలం ప్రారంభమై జలాశయంలోకి నీరు చేరగానే ఆగస్టులో తిరిగి నీట మునుగుతుంది. అయితే ఈసారి శ్రీశైలం బ్యాక్‌వాటర్ అనూహ్యంగా తగ్గిపోవడంతో మహాశివరాత్రికి ముందే ఫిబ్రవరి నెలలోనే ఆలయం బయటపడింది. అప్పటి నుంచి ఆలయ అర్చకులు తెలకపల్లి నిత్యపూజలు నిర్వహిస్తూ వచ్చారు. జలాశయంలోకి నీరు రావడం మొదలుకాగానే ఆలయాన్ని వరద నీరు చుట్టుముడుతూ వచ్చింది. శనివారం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరగానే కృష్ణమ్మ ఆలయాన్ని చుట్టుముట్టింది. మరో రెండురోజుల్లో సంగమేశ్వరాలయం మొత్తం నీట మునిగే అవకాశాలు ఉన్నాయి.